వెనిజులా రాజధాని కారకాస్‌లో మంగళవారం సాయంత్రం ఆకాశం ఎరుపు, నారింజ రంగుల్లోకి మారడం స్థానికులను ఆశ్చర్యపరిచింది. ఇటీవల భూకంపాల విషాదం నుంచి కోలుకోకముందే ఆకాశం నెత్తురు రంగులోకి మారడంతో, ఇది రాబోయే విపత్తుకు సంకేతమని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే, సహారా ఎడారి నుంచి వచ్చిన ధూళి కణాలు, కాంతి పరిక్షేపణ (రేలీ స్కాటరింగ్) వల్లనే ఆకాశం రంగు మారిందని నిపుణులు వివరించారు. తక్కువ తరంగదైర్ఘ్యం గల నీలి కాంతి చెల్లాచెదురై, ఎక్కువ తరంగదైర్ఘ్యం గల ఎరుపు, నారింజ కిరణాలు భూమిని చేరడం దీనికి కారణమని తెలిపారు.