ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విభిన్న వాతావరణం నెలకొంది. పగటిపూట 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, సాయంత్రం వేళల్లో వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం, మంగళవారం, బుధవారం ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడనున్నాయని తెలిపింది. ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేసింది.