వీధికుక్కల బీభత్సం.. 4 గంటల్లో 28 మందిపై దాడి

5702చూసినవారు
వీధికుక్కల బీభత్సం.. 4 గంటల్లో 28 మందిపై దాడి
AP: శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో వీధికుక్కలు బీభత్సం సృష్టించాయి. కేవలం 4 గంటల వ్యవధిలోనే ఏకంగా 28 మందిని కరిచి గాయపరిచాయి. ప్రధానంగా రోటరీనగర్ ప్రాంతంలో ఎక్కువ మంది కుక్కకాటు బారిన పడ్డారు. కారు, బైక్, సైకిళ్లపై వెళ్తున్న వారిని వెంబడించి దాడి చేస్తున్నాయి. బాధితుల్లో ఒక గర్భిణీ కూడా ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గాయపడిన వారందరినీ స్థానిక జిల్లా ఆస్పత్రిలో తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్