అమరావతిలో 1286 ప్లాట్లకు వీధి పోటు సమస్యలు ఉన్నాయని రైతులు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు వివరించారు. ఈ సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైతులు కోరితే వేరే చోట్ల ప్లాట్లు ఇచ్చేందుకు సిద్ధమని తెలిపారు. పెన్షన్లు, హెల్త్ కార్డుల సమస్యలను 30 రోజుల్లో పరిష్కరిస్తామని, లంకభూములు, అసైన్డ్ భూముల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రతి 14 రోజులకోసారి రైతుల సమస్యలను వింటామని ఆయన హామీ ఇచ్చారు.