AP:
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఏపీ పర్యటన ఖరారైంది. ఆగస్టు 17 నుంచి 21 వరకు ఐదు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. పార్టీని బూత్ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడం, భవిష్యత్ రాజకీయ వ్యూహాలను నిర్ణయించడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. ఆగస్టు 17న విశాఖపట్నం చేరుకోనున్న ఆయన, 18న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమై, యువతతో ముఖాముఖి చర్చలు జరుపుతారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోనూ సమీక్షలు నిర్వహిస్తారు.