సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీలపై కఠిన చర్యలు.. విద్యా కమిషన్ హెచ్చరిక

74చూసినవారు
సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీలపై కఠిన చర్యలు.. విద్యా కమిషన్ హెచ్చరిక
AP: కోర్సులు పూర్తయిన విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్లు సకాలంలో అందించని ప్రైవేటు కాలేజీలు, వర్సిటీల గుర్తింపు రద్దు చేస్తామని ఉన్నత విద్యా నియంత్రణ కమిషన్ హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.15 లక్షల వరకు జరిమానా విధిస్తామంది. అలాగే అదనంగా వసూలు చేసిన ఫీజులను విద్యార్థులకు తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఫ్యాకల్టీ సర్టిఫికెట్లను కూడా వెంటనే అప్పగించాలని స్పష్టం చేసింది. కాగా, ప్రైవేటు విద్యా సంస్థలపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ హెచ్చరికలు జారీ అయ్యాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్