తొక్కిసలాటకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం: CM

24చూసినవారు
తొక్కిసలాటకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం: CM
AP: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. “ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇకపై పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.

సంబంధిత పోస్ట్