రాష్ట్రం తరఫున బలమైన వాదనలు వినిపించాలి: మంత్రి నిమ్మల

77చూసినవారు
రాష్ట్రం తరఫున బలమైన వాదనలు వినిపించాలి: మంత్రి నిమ్మల
AP: ఏటా వృథాగా సముద్రంలో కలుస్తున్న 3000 టీఎంసీల గోదావరి నీటిలో 200 టీఎంసీలను వాడుకుంటే తప్పేంటని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. తోటి తెలుగు రాష్ట్రానికి స్నేహ హస్తం అందిస్తుంటే, వారు ఏపీకి అన్యాయం జరిగేలా కోర్టుకి వెళ్లడం విచారకరమన్నారు. నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై రేపు సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో అధికారులు, లాయర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రం తరఫున బలమైన వాదనలు వినిపించాలని మంత్రి నిమ్మల సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్