ఇంటర్‌లో ఫెయిల్.. మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య

3311చూసినవారు
ఇంటర్‌లో ఫెయిల్.. మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య
TG: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన హాబీబ్ ఉమేద్ (18) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సప్లిమెంటరీ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణుడవ్వకపోవడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్