AP: ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటుపడి అప్పులు చేసిన ఓ విద్యార్థి చివరికి ప్రాణాలు తీసుకున్నాడు. ఒడిశాకు చెందిన మహ్మద్ బషీర్(22) కాకినాడ(D) గండేపల్లి(M) సూరంపాలెంలోని ఓ వర్సిటీలో ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటుపడి.. పలు యాప్స్‌లో అప్పు తీసుకుని చెల్లించలేక గురువారం సాయంత్రం హాస్టల్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ‘అమ్మా సారీ. చాలా ఇబ్బంది పెట్టా. మంచి కొడుకుగా ఉండలేకపోయా. చాలా ఆలోచించా. నాకు సరైన మార్గం కనిపించడం లేదు. నువ్వు బాధపడతావని తెలుసు. ఐలవ్‌యూ అమ్మా' అని లేఖ రాసి మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.