AP: కడప జిల్లా చింతకొమ్మదిన్నెలో విషాదం చోటు చేసుకుంది. శ్రీచైతన్య పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని జస్వంతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రిమ్స్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జస్వంతి మృతితో కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.