ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని మృతి.. స్కూల్ ముందు పేరెంట్స్ ధర్నా (వీడియో)

8234చూసినవారు
AP: కురుపాం ఘటన మరువక ముందే మరో విద్యార్థిని మృతి కలకలం రేపుతోంది. మన్యం జిల్లా సీతంపేట మండలం హడుభంగి ఆశ్రమ పాఠశాలలో గిరిజన విద్యార్థిని అనుమానాస్పదంగా మృతిచెందింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థిని కుటుంబ సభ్యులు పాఠశాల ముందు నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయాలని, నిర్లక్ష్యానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమాచారం అందుకున్న ఐటీడీఏ పీవో స్వప్నిల్ పవర్ అక్కడికి చేరుకుని, విద్యార్థిని మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్