దివంగత నటుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటిస్తున్న 'స్టూడెంట్' సినిమా టీజర్ విడుదలైంది. విజేత పరీక్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి బాలు తత్వమసి దర్శకత్వం వహించారు. బెల్లం సిద్ధారెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథ ఒక విద్యార్థి అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చి ఎదుర్కొనే పరిస్థితుల చుట్టూ తిరుగుతుంది. భాను (మేఘాంశ్ శ్రీహరి) అనే విద్యార్థి ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ తరపున రాజకీయాల్లోకి వచ్చి, అందులోని ఎత్తుపల్లాలను ఎలా ఎదుర్కొంటాడనేది చూపించనున్నారు.