AP: విద్యా రంగ సమస్యలపై విశాఖలో నిరసన తెలిపిన AISF, AIYF నేతలపై రౌడీ షీట్లు తెరవడంపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. గుంటూరు కొత్తపేటలోని భగత్ సింగ్ విగ్రహం వద్ద కళ్ళకు నల్ల రుమాళ్లు కట్టుకొని నిరసన తెలిపారు. అక్రమ రౌడీ షీట్లను వెనక్కి తీసుకునే వరకు రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.