AP: అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం వెంకట నగర గ్రామానికి చెందిన హేమంత్ రాజ్ ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. మంగళవారం కాలేజీకి వెళ్తూ..తుని రైల్వే స్టేషన్‌లో జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాడు. ప్రమాదవశాత్తు రైలు నుంచి పట్టాలపై పడ్డాడు. గాయపడిన విద్యార్థిని మెరుగైన వైద్యం కోసం తుని రైల్వే పోలీసులు విశాఖలోని కేజీహెచ్‌కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతి చెందాడు.