AP: విశాఖపట్నంలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, వంచిత గిరిజన యువతకు విశ్వవిద్యాలయం ద్వారా సరైన న్యాయం జరుగుతుందని అన్నారు.
విద్యార్థులు భవిష్యత్ లక్ష్యాలు నిర్దేశించుకుని, నైపుణ్యాలు పెంచుకుని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆమె సూచించారు. పుస్తక జ్ఞానంతో పాటు వ్యవహార జ్ఞానం పెంపొందించుకోవాలని, సంస్కృతి పరిరక్షణతో పాటు సమాజ, దేశ భవిష్యత్ నిర్మించడంలో విద్యార్థుల పాత్ర కీలకమని ఆమె పేర్కొన్నారు.