ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయంలో బుధవారం తొలి స్నాతకోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా
విద్యార్థులు సవాళ్లను అధిగమించడానికి నూతన ఆలోచనలు, సాంకేతికతను అందిపుచ్చుకోవాలని రాష్ట్రపతి సూచించారు. విద్యాశాఖ మంత్రి
లోకేశ్ మాట్లాడుతూ, తొలి బ్యాచ్ విద్యార్థులకు ఎప్పుడూ ప్రత్యేక గుర్తింపు ఉంటుందని తెలిపారు.