కర్నూలులో రెండ్రోజుల క్రితం జాతీయ రహదారిపై మూడు ఆటోలతో స్టంట్స్ చేసిన ముగ్గురు ఆటో డ్రైవర్లను ట్రాఫిక్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పందించి ఆటోలను గుర్తించి డ్రైవర్లను అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.