AP: విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ఇటీవల సొంత పార్టీని ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు. ముద్రగడ సంస్మరణ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. అయితే డీఎస్సీలో అక్రమాలంటూ
వైసీపీ నిర్వహించిన ధర్నాలో పాల్గొని, టెంటు పీకేయడం వంటి చర్యలతో రచ్చ చేశారు. ఇది పార్టీ అధిష్టానం వద్ద మార్కులు కొట్టేసే ప్రయత్నమని, తన కుమారుడిని మేయర్ చేయాలన్న ఆలోచనలో భాగంగానే ఇలా చేస్తున్నారని చర్చ జరుగుతోంది. అయితే అధినేతకు తనపై నమ్మకం ఉందని, గుర్తింపు కోసం కాదని బోండా సన్నిహితులతో అంటున్నారట.