మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసి వ్యర్థాలను బయటకు పంపే మూత్రపిండాలు (కిడ్నీలు) అకస్మాత్తుగా పనిచేయడం మానేస్తే అది ‘అక్యూట్ కిడ్నీ ఇంజరీ’ (ఏకేఐ)గా పరిగణిస్తారు. ఇది ప్రాణాంతక పరిస్థితి. మూత్రం తగ్గడం, ముఖం, కాళ్లు, చేతుల్లో వాపు, తీవ్ర అలసట వంటివి తొలి సంకేతాలని వైద్యులు తెలిపారు. ఏకేఐకి కారణాన్ని గుర్తించి, డీహైడ్రేషన్‌కు సెలైన్, ఇన్‌ఫెక్షన్‌కు చికిత్స, హానికర మందులను ఆపడం, అవసరమైతే డయాలసిస్ వంటి చికిత్సలతో కిడ్నీలను, ప్రాణాలను కాపాడుకోవచ్చని సూచించారు.