కరాచీ పారామిలిటరీ హెడ్‌క్వార్టర్స్‌పై ఆత్మాహుతి దాడి.. ఆరుగురు మృతి (వీడియో)

18119చూసినవారు
పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో సింధ్ రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో ప్రధాన గేటును ఢీకొట్టిన అనంతరం విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో ముగ్గురు రేంజర్స్ సిబ్బంది, ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. అనంతరం భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ దాడికి 'జమాత్-ఉల్-అహ్రార్' ఉగ్ర సంస్థ బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించగా, ఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్