AP: వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం మాలపాడుకు చెందిన 19 ఏళ్ల వంకాయలపాటి శ్రీను, తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురై అడవిలోకి వెళ్ళాడు. తాను చనిపోతున్నట్లు వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో స్టేటస్ పెట్టడంతో గ్రామస్తులు ఆందోళన చెందారు. సుమారు 50 మంది గ్రామస్తులు గాలించినా ఆచూకీ లభించలేదు. విషయం తెలుసుకున్న బండ్లమోటు ఎస్సై సమీర్ భాషా, సిబ్బందితో కలిసి ఫోన్ లొకేషన్ ఆధారంగా గాలించి, అడవిలో అపస్మారక స్థితిలో ఉన్న శ్రీనును గుర్తించారు.