సుకన్య సమృద్ధి యోజన: నెలకు రూ.1,000 పొదుపు చేస్తే 21 ఏళ్లకు రూ.5 లక్షలు

9755చూసినవారు
సుకన్య సమృద్ధి యోజన: నెలకు రూ.1,000 పొదుపు చేస్తే 21 ఏళ్లకు రూ.5 లక్షలు
భారత ప్రభుత్వం 2015లో ప్రారంభించిన సుకన్య సమృద్ధి యోజన (SSY) పథకం ఆడపిల్లల భవిష్యత్తుకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ఈ పథకం కింద 10 ఏళ్లలోపు ఆడపిల్లల కోసం తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు ఖాతా తెరవవచ్చు. ఇందులో సంవత్సరానికి కనీసం రూ.250, గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. 15 సంవత్సరాల పాటు పొదుపు చేసి, 21 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ పొందవచ్చు. నెలకు రూ.1,000 చొప్పున 15 ఏళ్లు పొదుపు చేస్తే, 8% వడ్డీతో 21 ఏళ్ల తర్వాత సుమారు రూ.5.3 లక్షలు వస్తాయి. ఈ ఖాతాను పోస్టాఫీసులు, అధీకృత బ్యాంకులలో తెరవవచ్చు.

సంబంధిత పోస్ట్