ఆదివారం బడ్జెట్.. 27 ఏళ్ల తర్వాత అరుదైన ఘట్టం

3116చూసినవారు
ఆదివారం బడ్జెట్.. 27 ఏళ్ల తర్వాత అరుదైన ఘట్టం
భారత ఆర్థిక చరిత్రలో సుమారు 27 ఏళ్ల తర్వాత, కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1వ తేదీ, ఆదివారం నాడు లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టనున్నారు. భారత బడ్జెట్ చరిత్రలో ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది రెండోసారి మాత్రమే, గతంలో 1999లో ఇలా జరిగింది. నిర్మలా సీతారామన్ వరుసగా 9వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు, దేశ చరిత్రలో వరుసగా ఇన్నిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక ఆర్థిక మంత్రిగా ఆమె రికార్డు సృష్టించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్