‘శంబాల’ సినిమాతో హ్యాట్రిక్ హిట్ సాధించిన దర్శకుడు యుగంధర్ ముని, యంగ్ హీరో సందీప్ కిషన్‌తో కలిసి ‘కరికాల’ అనే భారీ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన సందీప్ కిషన్ ఫస్ట్ లుక్, విడుదల తేదీలను మేకర్స్ బుధవారం ప్రకటించారు. విడుదలైన పోస్టర్‌లో సందీప్ కిషన్ గుర్రంపై వేటాడుతున్న సింహంలా కనిపించి సినిమాపై అంచనాలను పెంచారు. ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందనుంది. చాప్టర్ 1 జులై 2, 2027న, చాప్టర్ 2 అక్టోబర్ 28, 2027న విడుదల కానుంది.