ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ విచారణకు హాజరుకావాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. సునీల్ నాయక్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఈ ఆదేశాలు వెలువడ్డాయి.