AP: వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్ ఈడీ విచారణ ముగిసింది. రెండో రోజు సునీల్ యాదవ్‌ను ఈడీ అధికారులు 4 గంటలపాటు ప్రశ్నించారు. సునీల్ యాదవ్‌తో A1 ఎర్ర గంగిరెడ్డి, A3 ఉమాశంకర్‌రెడ్డి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలపై ప్రశ్నించారు. వివేకా హత్య సమయంలో తాను స్పాట్లోనే ఉన్నట్లు ఈడీ అధికారులకు సునీల్ యాదవ్ వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది.
వైసీపీ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని సునీల్ యాదవ్ ఈడీ అధికారులకు తెలిపారు.