వేసవి తాపాన్ని తగ్గించేందుకు మినీ ఏసీలు, పోర్టబుల్ కూలర్లతో పాటు పర్సనల్ రిఫ్రిజిరేటర్లకు డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా ప్రయాణాల్లో, ఆఫీసుల్లో వాడటానికి Nostalgia RF6RRAQ Retro మినీ ఫ్రిజ్ అద్భుతమైన ఆప్షన్. ఇది 6 కూల్ డ్రింక్ క్యాన్లు పట్టేంత స్థలంతో, 7 డిగ్రీల సెల్సియస్ వరకు కూలింగ్, 48 డిగ్రీల సెల్సియస్ వరకు హీటింగ్ చేసే సామర్థ్యంతో తయారు చేశారు. ఏసీ, డీసీ పవర్ కార్డ్స్ ఉండటంతో ఇంట్లో, కారులోనూ వాడుకోవచ్చు. అమెజాన్‌లో ప్రస్తుతం రూ.3711కే ఆరు రంగుల్లో లభిస్తోంది.