సూపర్ ఫుడ్ గా పరిగణించబడే చియా గింజలు, మెక్సికో మూలాలున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్స్, ఫైబర్స్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి కీలక పోషకాలు దట్టంగా ఉంటాయి. రోజుకు 2-3 స్పూన్ల చియా గింజలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి, ఎముకల ఆరోగ్యం పెరుగుతుంది, గుండె పనితీరు మెరుగుపడుతుంది, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.