అనిల్ అంబానీకి సుప్రీం షాక్

4237చూసినవారు
అనిల్ అంబానీకి సుప్రీం షాక్
ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి చెందిన ఏడీఏజీ సంస్థలపై భారీ బ్యాంకింగ్, కార్పొరేట్ మోసాల ఆరోపణలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరిపేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సీనియర్ అధికారులతో కూడిన ప్రత్యేక సిట్ ఏర్పాటు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్, సీబీఐ, ఈడీ ఇప్పటివరకు జరిపిన విచారణపై అసహనం వ్యక్తం చేస్తూ, వచ్చే 4 వారాల్లో కొత్త స్టేటస్ రిపోర్టులను సమర్పించాలని ఆదేశించింది. మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఆధారంగా ఈ విచారణ జరుగుతోంది. అనిల్ అంబానీ దేశం విడిచి వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్న పిటిషనర్ వాదనపై, అంబానీ భారత్‌లోనే ఉంటారని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లబోరని ఆయన తరఫు న్యాయవాది హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్