విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో రాష్ట్ర రాజకీయాల్లో విషాదం నెలకొంది. ఈ ఘటనలో రాజకీయ విభేదాలను పక్కన పెట్టి పవార్ కుటుంబంలో కనిపించిన ఐక్యత బారామతి ప్రజలను ఆకట్టుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా నిలిచిన సుప్రియా సూలే, సునేత్ర పవార్ అంత్యక్రియల సమయంలో కలిసి కనిపిస్తూ పరస్పరం అండగా నిలిచారు. మృతదేహాన్ని బారామతికి తీసుకొచ్చినప్పటి నుంచి అంత్యక్రియలు పూర్తయ్యే వరకు సుప్రియా తన వదిన చేతిని విడవకుండా ధైర్యం చెప్పారు.