మేడారంలో ఏఐ డ్రోన్లతో నిఘా.. కమాండ్ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షణ

11810చూసినవారు
మేడారంలో ఏఐ డ్రోన్లతో నిఘా.. కమాండ్ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షణ
TG: మేడారం జాతర పరిసరాలను పోలీసులు కృత్రిమ మేధస్సు (ఏఐ) డ్రోన్లతో నిఘా నిర్వహిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షిస్తున్నారు. వరంగల్ సీపీ సన్​ప్రీత్ సింగ్ జాతర ట్రాఫిక్ ఇన్​చార్జిగా వ్యవహరిస్తున్నారు. పస్రా జంక్షన్ నుంచి మేడారం వరకు ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక పోలీస్ చెక్ పోస్టు ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రిస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం ఆరుగురు ఎస్పీలు, ఆరుగురు అడిషనల్​ ఎస్పీలు, 26 మంది డీఏస్పీలు, 124 మంది సీఐలు, 200 మంది ఎస్సైలు, 4,138 మంది పోలీస్ సిబ్బంది విధుల్లో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్