‘విశ్వనాథ్‌ అండ్ సన్స్‌’.. పాట పాడిన సూర్య

647చూసినవారు
‘విశ్వనాథ్‌ అండ్ సన్స్‌’.. పాట పాడిన సూర్య
ప్రస్తుతం 'కరుప్పు' సినిమా విజయంతో జోష్‌లో ఉన్న హీరో సూర్య, తన కొత్త చిత్రం 'విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌' గురించి ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చారు. 2014లో 'అంజన్' చిత్రంలో 'ఏక్ దో తీన్' పాట పాడిన సూర్య, ఈ చిత్రంలోనూ స్వయంగా ఓ పాట పాడారు. ఇది పూర్తి స్థాయి హుషారైన డ్యాన్స్ నంబర్ అని తెలుస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ పాటకు కెన్ కరుణాస్ లిరిక్స్ రాశారు. ఈ విషయాన్ని జీవీ ప్రకాష్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. సూర్య పాడిన ఈ పాట సినిమాకే హైలైట్‌గా నిలవనుంది.

సంబంధిత పోస్ట్