టాలీవుడ్ లో సినిమాల విడుదల తేదీల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే సెట్స్ పై ఉన్న బడా సినిమాల విడుదల తేదీలు ప్రకటించినా, వివిధ కారణాలతో పోస్ట్ పోన్ అవుతున్నాయి. దీంతో హీరోల అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిరంజీవి విశ్వంభర, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, రామ్ చరణ్ పెద్ది, నాని ది ప్యారడైజ్ చిత్రాల విడుదల తేదీలపై ఎక్కువ చర్చ జరుగుతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 26న విడుదల కానుంది. చరణ్ పెద్ది మార్చి 27 నుంచి ఏప్రిల్ 30కి వాయిదా పడింది. విశ్వంభర జులై 9, 10న విడుదలయ్యే అవకాశం ఉంది. ది ప్యారడైజ్ విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు.