AP: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సంచలన నిర్ణయం తీసుకుంది. నలుగురు అన్యమత ఉద్యోగులను సస్పెండ్ చేసింది. క్వాలిటీ కంట్రోల్ డీఈ బి.ఎలిజర్, బర్డ్ ఆస్పత్రి స్టాఫ్‌నర్స్ ఎస్.రోసి, బర్డ్ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఫార్మాసిస్ట్ ప్రేమావతి, ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీలో పని చేస్తున్న అసుంతలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరు క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నట్లు నిర్ధారణ అయిన తర్వాత టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.