అజిత్ పవార్ మృతిపై అనుమానాలు.. సమగ్ర విచారణకు ఖర్గే డిమాండ్

9401చూసినవారు
అజిత్ పవార్ మృతిపై అనుమానాలు.. సమగ్ర విచారణకు ఖర్గే డిమాండ్
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతిపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నాయకులు విమానాల్లో ప్రయాణించేటప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరగడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన ఆరోపించారు. ఈ ప్రమాదం అసాధారణమని, విమానం ఎందుకు కూలిపోయిందనే దానిపై సమగ్ర విచారణ జరగాలని ఆయన కోరారు. అజిత్ పవార్‌ అనుభవజ్ఞుడైన, ప్రజల పట్ల నిబద్ధత కలిగిన నాయకుడని ఖర్గే పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్