మైనర్ బాలిక అనుమానాస్పద మృతి (వీడియో)

9281చూసినవారు
AP: చిత్తూరు జిల్లా గంగవరం మండలం బండమీద జరావారిపల్లెలో బాలిక శిరీష అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇంట్లో ఉరి వేసుకుని కనిపించిన బాలికను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే, తమ బిడ్డను హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గ్రామంలోని ఓ యువకుడి తండ్రి నాగరాజు తమ కూతురిని బెదిరించాడని, అతని వల్లే మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోపించారు. నాగరాజు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు అనుమానస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్