AP: శ్రీకాకుళం, ఇచ్ఛాపురం మండలానికి చెందిన ఓ యువకుడు అబుధాబిలో మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. డొంకూరు గ్రామానికి చెందిన రామమూర్తి, భాగ్యలక్ష్మి దంపతులకు కుమారుడు భాస్కరరావు చంటి (22), కుమార్తె ఉన్నారు. కుమారుడు ఏడాదిన్నర కిందట అబుధాబి వెళ్లి అక్కడ వెల్డింగ్ హెల్పర్‌గా చేరాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.