విశాఖపట్నంలో స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంను రూ.16.90 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో పునఃనిర్మించి, తాజాగా ప్రారంభించారు. విశాఖ ఎంపీ శ్రీభరత్ ఈ స్టేడియంను ప్రారంభించారు. ఇందులో సెంట్రల్ ఏసీ, అధునాతన ఫైర్ ఫైటింగ్ యంత్రాలు, 1750 మంది ప్రేక్షకుల సామర్థ్యం, సీసీ కెమెరాల పర్యవేక్షణ వంటి సౌకర్యాలు ఉన్నాయి. క్రీడాకారులకు నామమాత్రపు ఫీజులతో సేవలు అందుబాటులో ఉంటాయని, విశాఖను స్పోర్ట్స్ హబ్‌గా మారుస్తామని ఎంపీ భరత్ తెలిపారు. కూటమి ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు.