AP: అనంతపురంలో కదులుతున్న ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైల్లోంచి స్విగ్గీ డెలివరీ బాయ్ కిందపడిపోయాడు. 1st AC కోచ్‌లోని ప్రయాణికుడికి ఆహారం అందిస్తున్న సమయంలో.. రైలు ఒక్కసారిగా కదలడంతో ఈ ప్రమాదం జరిగింది. కేవలం 1-2 నిమిషాలు మాత్రమే ఆగిన రైల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు, డెలివరీ బాయ్‌కు తృటిలో ప్రాణాపాయం తప్పింది.