టీ20 ప్రపంచకప్.. భారత్-పాక్ మ్యాచ్‌లకు అనుభవజ్ఞులైన అంపైర్లు

5085చూసినవారు
టీ20 ప్రపంచకప్..  భారత్-పాక్ మ్యాచ్‌లకు అనుభవజ్ఞులైన అంపైర్లు
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్ దశ మ్యాచ్‌లకు 24 మంది ఆన్‌ఫీల్డ్ అంపైర్లు, ఆరుగురు మ్యాచ్ రిఫరీలను ఐసీసీ ప్రకటించింది. ఫిబ్రవరి 7 నుంచి 20 వరకు జరిగే ఈ మ్యాచ్‌లలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, కుమార్ ధర్మసేనలను నియమించారు. టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో పాకిస్థాన్-నెదర్లాండ్స్ మధ్య కుమార్ ధర్మసేన, వేన్ నైట్స్ అంపైర్లుగా వ్యవహరిస్తారు. భారత్-అమెరికా మ్యాచ్‌కు పాల్ రీఫెల్, రాడ్ టక్కర్, వెస్టిండీస్-స్కాట్లాండ్ మ్యాచ్‌కు నితిన్ మీనన్, సామ్ నోగాజ్స్కీ అంపైర్లుగా ఉంటారు. సూపర్-8, నాకౌట్ మ్యాచ్‌లకు అంపైర్ల జాబితా తర్వాత ప్రకటిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్