ఐసీసీ మహిళల
టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా, సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడుతోంది. లార్డ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్టులో నందిని శర్మ స్థానంలో క్రాంతి గౌడ్ ఆడుతోంది. ఇప్పటికే సెమీస్ బెర్తు ఖరారు చేసుకున్న
ఆసీస్ తో తలపడుతున్న భారత్, గెలిస్తేనే సెమీస్‌లో అడుగుపెట్టగలదు.