టీ20 ప్రపంచకప్.. అమెరికా జట్టు ప్రకటన

2309చూసినవారు
టీ20 ప్రపంచకప్.. అమెరికా జట్టు ప్రకటన
ఫిబ్రవరి 7 నుంచి జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం అమెరికా జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు భారతీయ సంతతికి చెందిన మోనాంక్ పటేల్ నాయకత్వం వహించనున్నాడు. గత ప్రపంచకప్‌లో ఆడిన 15 మందిలో 10 మంది ఈసారి జట్టులో చోటు దక్కించుకున్నారు. గత ఏడాది ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించినందుకు యూఎస్‌ఏ క్రికెట్‌ను సస్పెండ్ చేసిన నేపథ్యంలో, కొత్త ఎంపిక విధానం ద్వారా ప్రతిభ ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేశారు. అమెరికా జట్టు తొలి మ్యాచ్‌లో ఆతిథ్య దేశం భారత్‌తో తలపడనుంది. గత ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ను ఓడించి సూపర్ 8దశకు చేరిన అమెరికా, ఈసారి కూడా అదే ప్రదర్శన కనబరచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్