టీ20 ప్రపంచ కప్ వార్మప్: సౌతాఫ్రికాపై టీమిండియా ఘన విజయం

1760చూసినవారు
టీ20 ప్రపంచ కప్ వార్మప్: సౌతాఫ్రికాపై టీమిండియా ఘన విజయం
ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో బుధవారం జరిగిన టీ20 ప్రపంచ కప్ వార్మప్ మ్యాచ్‌లో సౌతాఫ్రికాను 30 పరుగుల తేడాతో టీమిండియా ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 240 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (53), తిలక్ వర్మ (45), హార్దిక్ పాండ్యా (30) రాణించారు. 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లకు 210 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. అర్షదీప్ సింగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తిలకు తలో వికెట్ దక్కింది.

సంబంధిత పోస్ట్