AP: తాడేపల్లి ప్యాలెస్ కేరాఫ్ అడ్రస్‌గా లిక్కర్ స్కామ్ జరిగిందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. సోమవారం అమరావతిలోని
ఎన్టీఆర్ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘ఎన్నికల్లో మద్యపాన నిషేధం అని చెప్పి, అధికారంలోకి వచ్చాక వేల కోట్ల దోపిడీ కోసమే మద్యం పాలసీని మార్చారు. అవినీతిపై విచారణ జరిపితే ప్రజల దృష్టి మళ్లించడానికి రాజకీయ కక్షలంటూ ఎదురుదాడికి దిగుతున్నారు. కారుమూరి నాగేశ్వరరావుకి గతంలో ఎలాంటి నేర చరిత్ర లేకపోయినా,
జగన్ మాయలో పడి లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కుపోయారు’ అని అన్నారు.