AP: ముస్లిం విద్యార్థులకు ఉచిత కార్పొరేట్ విద్య అందించేందుకు ప్రభుత్వం తాలీం-ఏ-హునర్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకానికి అర్హుల ఎంపికకు గాను ఈ నెల 17న టాలెంట్ టెస్ట్ నిర్వహించనుంది. ఈ పథకం కింద కార్పొరేట్ కాలేజీల్లో ఉచిత ఇంటర్ విద్యతో పాటు ఐఐటీ-జేఈఈ, నీట్, ఎంసెట్‌లకు ఉచిత శిక్షణ ఇవ్వనుంది. ఈ నెల 12 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల విద్యార్థులు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.