తమిళనాడు ఎన్నికల రోజు.. ఏపీలో వీరికి సెలవు

126చూసినవారు
తమిళనాడు ఎన్నికల రోజు.. ఏపీలో వీరికి సెలవు
AP: ఏప్రిల్ 23న తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా తిరుపతి, చిత్తూరు జిల్లాలలో పనిచేసే ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం పోలింగ్ రోజు ఏపీలో పని చేస్తున్న తమిళనాడు ఓటర్లకు, రోజువారీ వేతన కార్మికులతో సహా అందరికీ వేతనంతో కూడిన సెలవు వర్తిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్