పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్ జలసంధిలో దాడికి గురైన ఎంటీ సన్మార్ హెరాల్డ్ అనే చమురు ట్యాంకర్ కొన్ని గంటల క్రితం ఒడిశాలోని పారాదీప్ పోర్ట్‌కు చేరుకుంది. 2 మిలియన్ బ్యారెళ్ల ఇరాక్ చమురుతో ప్రయాణిస్తున్న ఈ నౌకపై ఇరాన్ జలాల్లో తుపాకులతో కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. సిబ్బంది భద్రత దృష్ట్యా నౌక మార్గం మార్చుకుంది. భారత నౌకాదళంతో సమన్వయం చేసుకుంటూ దేశ తీరం వైపు ప్రయాణించిన ఈ నౌక, ప్రస్తుతం పారాదీప్ పోర్ట్‌కు 22 కి.మీ. దూరంలో లంగరేసింది. దాని నుంచి చమురును అన్‌లోడ్ చేసే ప్రక్రియ ప్రారంభం కానుంది.