టీజీ20 2
026లో కరీంనగర్ డైమండ్స్ తమ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. వరంగల్ వారియర్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో రెండు పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. ఉప్పల్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో, కరీంనగర్ తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ 61 బంతుల్లో 15 ఫోర్లు, 7 సిక్సర్లతో 133 పరుగులు చేసి అదరగొట్టాడు. లక్ష్య ఛేదనలో వరంగల్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 207 పరుగులు మాత్రమే చేయగలిగింది.