AP:స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాల కోసం కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా
టీడీపీ,
జనసేన పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. వచ్చే నెలలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని నాయకులు చెబుతున్నారు. మంత్రి నారా లోకేశ్ నెల రోజులుగా స్థానిక ఎన్నికలపై దృష్టి సారించి ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల కాకినాడలో సన్నాహక సమావేశం నిర్వహించారు. స్థానిక ఎన్నికల బాధ్యతలను లోకేశ్‌కు అప్పగించాలని
టీడీపీ నేతలు కోరుతున్నట్లు సమాచారం. లోకేశ్, పవన్ ప్లాన్లతో ఈసారి స్థానిక ఎన్నికలకు ముందు జోరు నెలకొంది.